''అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం'' - చంద్రబాబు
చంద్రబాబు ఎవరికి టికెట్ కేటాయించినా సమష్టిగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తామని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు.
కాకినాడలోని తెదేపా జిల్లా కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన హోంమంత్రి చినరాజప్ప... తెలుగుదేశం విజయంపై ధీమా వ్యక్తం చేశారు.అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు తూర్గుగోదావరిజిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని... అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని అభిప్రాయపడ్డారు.చంద్రబాబు ఎవరికి టికెట్ కేటాయించినా సమష్టిగా పని చేస్తామని తెలిపారు.అన్ని నియోజకవర్గాల్లోనూ తెదేపాను గెలిపిస్తామని వ్యాఖ్యానించారు. ఒకటిరెండు చోట్ల ఆశావహులకు టికెట్ రాకపోయినామరో విధంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.చెలమలశెట్టి సునీల్ మార్చి ఒకటిన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతానని వెల్లడించారు.