ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళితులపై దాడులకు నిరసనగా... తెలుగుదేశం దళిత శంఖారావం - కడియంలో తెలుగుదేశం దళిత శంఖారావం

వైకాపా పాలనలో దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆరోపిస్తూ.. తూర్పుగోదావరి జిల్లా కడియంలో తెదేపా దళిత శంఖారావం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు గోరంట్ల బుచ్యయ్య చౌదరి, జవహర్ పాల్గొన్నారు.

tdp dalith sankaravam
కడియంలో తెలుగుదేశం దళిత శంఖారావం

By

Published : Nov 25, 2020, 8:48 AM IST

దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో తెలుగుదేశం దళిత శంఖారావం నిర్వహించింది. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేమగిరి నుంచి కడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభకు దళిత నాయకులు, తెదేపా శ్రేణులు తరలివచ్చారు.

వైకాపా పాలనలో దోపిడీలు, దౌర్జన్యాలు మితిమీరాయని....ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేయడం లేదని ఎమ్మెల్యే గోరంట్ల ఆరోపించారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులు, మైనారిటీలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని తెదేపా రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు జవహర్ అన్నారు. వైద్యుడు సుధాకర్ ఘటన నుంచి నంద్యాల సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనలే దీనికి ఉదాహరణలన్నారు.

ABOUT THE AUTHOR

...view details