తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న 20 మంది తెదేపా అభ్యర్థులు వైకాపాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమను పోటీ నుంచి తప్పుకోవాలని అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరిస్తున్నారని ఎస్ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను నిలిపేస్తామంటున్నారని తెదేపా అభ్యర్థులు చెప్పారు.
వైకాపా నాయకులు బెదిరిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు - ఏలేశ్వరం తెదేపా కౌన్సిలర్స్ ఎస్ఈసీకి ఫిర్యాదు
కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమను పోటీ నుంచి వైదొలగాలని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారంటూ ఏలేశ్వరం తెదేపా మున్సిపల్ అభ్యర్థులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. 20 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఈ మేరకు లేఖ రాశారు.
వైకాపా నాయకులు బెదిరిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు