ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాకినాడలో పాలు దొరకవు కానీ మద్యం ఏరులై పారుతోంది' - east godavari district

వైన్‌ షాపులు తక్షణం మూసివేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెదేపా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. పిల్లలకు పాలు దొరడం లేదని... మద్యం మాత్రం ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

east godavari district
వైన్‌ షాపులు తక్షణం మూసివేయాలి

By

Published : Jul 30, 2020, 4:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైన్‌ షాపులు తక్షణం మూసివేయాలంటూ తెలుగుదేశం కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. కొవిడ్‌ విజృంభనలో హాట్‌స్పాట్‌గా నమోదైన కాకినాడలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేస్తున్నారని.. ఏమాత్రం నియంత్రణ ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పిల్లలకు పాలు దొరడం లేదని... మద్యం మాత్రం ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభానికి ముందు తెలుగుదేశం కార్పొరేటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. మద్యం విక్రయాలు నియంత్రించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. ‌

ABOUT THE AUTHOR

...view details