అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఇసుక అక్రమాలను అధికారులు అడ్డుకోకుంటే.. తెదేపా తరపున ఉద్యమం చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు.
'వైకాపా నేతల ఇసుక దందాను అడ్డుకోండి' - తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా నేతల ఇసుక దందా
వైకాపా నాయకులు అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తున్నారని తెదేపా ఆరోపించింది. దీనిని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద తెదేపా నేతలు నిరసన తెలిపారు.
tdp comments
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద తెదేపా నేతలు మట్టి, ఇసుక అక్రమాలపై నిరసన తెలిపారు. ఇళ్ల స్థలాల పేరుతో బొండు మట్టిని బయటి ప్రాంతాలకు తరలించి అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్నాయని తెదేపా నేతలు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు.