ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rain Problems: 'ధాన్యం అమ్ముకోవాలంటే.. ఎదురు డబ్బులివ్వాల్సిన దుస్థితి' - Chandrababu tour in east godavari district

Chandrababu in East Godavari District: అకాల వర్షాలకు పంట దెబ్బతిని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులను మిల్లర్లు దోచుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రైతులకు రకరకాల ఆంక్షలు పెడుతూ, ధాన్యం అమ్ముకోవాలంటే ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యానికి మద్దతు ధర దక్కకపోయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

Chandrababu Naidu
చంద్రబాబు

By

Published : May 6, 2023, 8:12 PM IST

Chandrababu Naidu: 'ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది'

Chandrababu in East Godavari District: వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. చాగల్లు మండలం ఊనగట్లలో వర్షాలకు తడిసిపోయిన ధాన్యం కల్లాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. మొలకెత్తిన ధాన్యపు రాశులను చంద్రబాబుకు చూపించిన రైతులు.. తమ పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు.

ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారిందన్న చంద్రబాబు.. నిబంధనల పేరుతో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతులకు గోనెసంచెలు కూడా సరఫరా చేయడం లేదని.. ధాన్యం రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని చంద్రబాబు హెచ్చరించారు.

కొవ్వూరు పరిధిలోని వాన ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు తిరిగారు. తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆ తర్వాత నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసి, రంగుమారి, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

"నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని.. ఎందుకు మీరు రైస్ మిల్లర్లకు లైసెన్స్ ఇచ్చారు. రైస్ మిల్లర్లు అనధికారికంగా రైతుల నుంచి ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారు. మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు. నష్టపోయిన రైతులను ఆదుకుంటే సహకరిస్తాం.. లేదంటే పోరుబాట తప్పదు". - చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత

భారీ వర్షాల వల్ల ధాన్యం రైతులు నష్టపోయారని.. తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో.. వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. బాధిత రైతుల ఇక్కట్లను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్లలో రైతులు చంద్రబాబు వద్ద తమ వెళ్లబోసుకున్నారు. ఈ సమయంలో చంద్రబాబు కాన్వాయ్​ను పోలీసులు బలవంతంగా ముందుకు పంపించారు. దీంతో టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే విధంగా మఫ్టీలో ఉన్న పోలీసులు వీడియోలు, ఫొటోలు తీయడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయడం చేతగాని ప్రభుత్వం.. తన పర్యటనపైనా నిఘా పెట్టిందని దుయ్యబట్టారు.

"దగా ప్రభుత్వం.. రైతులు కుదేలు అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. మా పంట మునిగింది.. దానికి పరిహారం ఇవ్వండని రైతులు అడుగుతున్నారు. నీ ఆర్బీకే ఏమైందని జగన్ రెడ్డిని అడుగుతున్నాను. రైస్ మిల్లర్లు డబ్బులు అడిగితే వారిని జైలులో పెడతా అని అన్నావు. ఇప్పుడు పెడతావా అని అడుగుతున్నాను. 1530 రూపాయలు ఇవ్వాల్సింది.. 1200 రూపాయలు ఇస్తున్నారు. మిగతా 330 రూపాయలు ఎవరు దోచుకున్నారు. దీనికి సమాధానం చెప్పండి". - చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details