తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో మొత్తం 20 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 16 వార్డుల్లో వైకాపా విజయాన్ని కైవసం చేసుకోగా.. తెదేపా 4 వార్డుల్లో గెలిచింది.
8వ వార్డులో పోరు ఉత్కంఠగా సాగగా.. 10 ఓట్ల తేడాతో వైకాపా విజయం సాధించింది. దీంతో తెదేపా శ్రేణులు రీకౌంటింగ్ చేపట్టాలని ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్ చేపట్టలేమని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.