ఇదీ చదవండి :
అమరావతికి మద్దతుగా ప్రత్తిపాడులో బైక్ ర్యాలీ... - ప్రత్తిపాడులో టీడీపీ బైక్ ర్యాలీ
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు సేవ్ అమరావతి పేరిట ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రత్తిపాడు నుంచి ఎర్రవరం వరకు 600 ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేశారు. బైక్ ర్యాలీలో తెదేపా నేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా పాల్గొన్నారు. అనంతరం ఎర్రవరంలో అమరావతినే రాజధానిగా కొనసాంచాలని ప్రజాబ్యాలెట్ నిర్వహించారు.
సేవ్ అమరావతి పేరిట ప్రత్తిపాడులో బైక్ ర్యాలీ
Last Updated : Jan 17, 2020, 6:53 PM IST