మూడు రాజధానులకు వ్యతిరేకంగా, శాసనమండలి రద్దుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రామవరం నుంచి బిక్కవోలు మీదుగా పెడపుది మండలం గొల్లలమామిడాడ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకమైన విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులపేరుతో ప్రాంతాలు, కులాలు విచ్ఛిన్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు.