పురపాలక సంఘం ఎన్నికలకు ప్రతీ కార్యకర్త సిద్ధం కావాలని... పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తణుకులో జరిగిన పట్టణ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు భయపడవద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని... పురపాలక ఎన్నికలలో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.
'అధికార పార్టీ నాయకుల ఆగడాలకు భయపడొద్దు' - తణుకు తెదెేపా సమావేశం
అధికార పార్టీ నాయకుల ఆగడాలకు భయపడాల్సిన పని లేదని... తణుకు మాజీఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తెదేపా కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
!['అధికార పార్టీ నాయకుల ఆగడాలకు భయపడొద్దు' tanuku mla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10665831-681-10665831-1613566369302.jpg)
'అధికార పార్టీ నాయకుల ఆగడాలకు భయపడొద్దు'
రాబోయే ఎన్నికల కోసం పక్కా ప్రణాళికను రూపొందిస్తామని రాధాకృష్ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నూతనంగా నియమించిన పట్టణ కమిటీలను సమావేశంలో పరిచయం చేశారు.
ఇదీ చదవండి:అమలాపురం డివిజన్లో 14 పంచాయతీలు ఏకగ్రీవం