ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కౌలు రైతులకూ సంక్షేమ పథకాలు అందాలి' - Government schemes for tenant farmers

తూర్పుగోదావరి జిల్లాలో కౌలు రైతుల సంఘం ఆందోళనకు దిగింది. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినాదాలు చేసింది. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేయాలని డిమాండ్ చేసింది. తాము పెట్టుబడి నష్టపోతే సాయం మాత్రం భూ యజమానులకు అందుతోందని ఆరోపించింది. పంటలు సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

tanant farmers Association
కౌలు రైతుల సంఘం ఆందోళన

By

Published : Dec 3, 2020, 7:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రాష్ట్ర కౌలు రైతుల సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. తుపానుతో పంట నష్టపోయిన కౌలు రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. నాలుగు నెలలుగా కష్టపడి పెంచిన పంటలు పాడై పెట్టుబడి నష్టపోతే సాయం భూయజమానులకు అందుతోందని ఆరోపించారు. సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకూ పంట రుణాలు, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details