ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తమ్మినేని సీతారాం - Annavaram Satyanarayana Swami latest news

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం అందించారు.

Tammineni Sitaram visited Annavaram Satyanarayana Swami
అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తమ్మినేని సీతారాం

By

Published : Mar 19, 2021, 4:11 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్​ రోహిత్​, ఈవో త్రినాథరావులు మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు సీతారాంకు ఆశీర్వచనం గావించి.. తీర్థ ప్రసాదాలు అందించారు.

ఆలయ దర్శనానికి వచ్చిన సందర్భంగా నిత్యాన్నదానానికి స్పీకర్​ లక్ష రూపాయల విరాళం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించడం.. రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి:ఏలేశ్వరం మున్సిపాలిటీలో.. కౌన్సిలర్లుగా భార్యాభర్తలు

ABOUT THE AUTHOR

...view details