తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సంజీవని బస్సు ద్వారా వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరీక్షలు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించారు. స్థానిక అధికారులు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ సోకి ఇంటిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు నిత్యం వైద్య సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలన్నారు.
'కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోండి' - కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోండి
కరోనా పరీక్షల నిమిత్తం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
!['కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోండి' east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8221851-566-8221851-1596032242715.jpg)
కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోండి