ఉభయగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఓటు హక్కుకోసం నవంబర్ 6లోగా దరఖాస్తులు చేసుకోవాలని తూర్పు గోదావరిజిల్లా పి. గన్నవరం తహసీల్దార్ బీ మృత్యుంజయరావు కోరారు. ఓటుపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయ సంఘ నేతలకు అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి నుంచి పాఠాలు బోధించే ఉపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు ఓటు హక్కు పొందడానికి అర్హత ఉందని ఆయన వివరించారు. మూడు సంవత్సరాల సర్వీసు ఉండి.. ఆరు సంవత్సరాలు సాధారణ నివాసం కలిగి ఉండాలని వారికి సూచించారు.
ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం నవంబర్ 6 లోగా దరఖాస్తు చేసుకోవాలి - పి. గన్నవరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తాజా వార్తలు
ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరూ దరఖాస్తు చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం తహసీల్దార్ కోరారు.
పి. గన్నవరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు