కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు తూర్పు గోదావరి జిల్లా తునిలో నార్ల రత్నాజీ, భువనసుందరి దంపతులు టీషర్టులు పంపిణీ చేశారు. 'షేక్ హ్యాండ్ వద్దు... నమస్తే ముద్దు', 'ఇంటి వద్ద ఉందాం... క్షేమంగా ఉందాం' అనే నినాదాలతో ముద్రించిన టీషర్ట్లను వాలంటీర్లు, సిబ్బందికి అందించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు రత్నాజీ దంపతులు తెలిపారు.
కరోనాపై నినాదాలతో టీ షర్టుల పంపిణీ - t shirts distribution news in thuni
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఔత్సాహికులు వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో నార్ల రత్నాజీ, భువనసుందరి దంపతులు టీషర్టులు పంపిణీ చేశారు.
టీ షర్టుల పంపిణీ