ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని మోదీ, అమిత్ ​షాకు ప్రాణగండం: పరిపూర్ణానంద - మోదీ అమిత్​షాల గురించి స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యలు

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆధ్యాత్మిక వేత్త, భాజపా నాయకుడు స్వామి పరిపూర్ణానంద పర్యటించారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రికి ముప్పు ఉందంటూ.. ఓ ఆడియో క్లిప్ ను సాక్ష్యంగా వినిపించారు. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

swamy-paripurnananda
swamy-paripurnananda

By

Published : Feb 24, 2020, 9:56 AM IST

సభలో మాట్లాడుతున్న స్వామి పరిపూర్ణానంద

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు ప్రాణగండం ఉన్నట్లుగా... ఓ ముల్లా చెప్పారంటూ.. భాజపా నేత స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు. ఆ ముల్లాకు సంబంధించిన ఆడియో టేప్ ఇదే అంటూ..తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఓ ఆడియో ఫైల్ ను వినిపించారు. కేంద్ర నిఘా సంస్థలు విచారణ చేయాలన్నారు. అలాగే.. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మార్చి 1న పిఠాపురంలో 30 వేల మందితో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. అప్పటిలోగా విగ్రహధ్వంసం ఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details