ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో ఘనంగా  ఎస్వీ రంగారావు జయంతి - రాజమహేంద్రవరంలో ఎస్వీ రంగారావు జయంతి వార్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానికులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

SV Rangarao   birthday celebrations in rajamahendravaram
రాజమహేంద్రవరంలో ఎస్వీ.రంగారావు 102 జయంతి వేడుకలు

By

Published : Jul 3, 2020, 5:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు జయంతిని జరిపారు. గోదావరి గట్టున గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎస్వీఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌, పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ట్రస్ట్‌, కేబుల్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌, చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఏడాది జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీసీసీ ఛానల్‌ ఎండీ కొండలరావు తెలిపారు. పేదలకు ఆహార పొట్లాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రౌతు సూర్యప్రకాశరావు, ఇతర నాయకులు, ఎస్వీఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details