తెలుగు ప్రజల మన్నలు పొందిన నటచక్రవర్తి ఎస్వీ రంగారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాజమహేంద్రవరం ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఎస్వీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తకాలు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎస్వీఆర్ నటనా వైశిష్ట్యాన్ని కొనియాడారు. ఈ ఏడాది మొక్కల పెంపకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపడతామని పంతం ట్రస్ట్ ఛైర్మన్, ట్రిపుల్ సీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు తెలిపారు.
ఘనంగా నటచక్రవర్తి 101వ జయంతి - pantham charitable trust
విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు 101వ జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరంలో ని ఎస్వీఆర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
![ఘనంగా నటచక్రవర్తి 101వ జయంతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3735379-1044-3735379-1562156046006.jpg)
ఎస్వీ రంగారావు 101వ జయంతి వేడుకలు