ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటవీప్రాంతంలో వృద్ధుని అనుమానాస్పద మృతి - మారేడుమిల్లి మండలం

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని సమీప అటవీ ప్రాంతంలో ఓ వృద్ధుడి మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

east godavari district
అనుమానాస్పదంగా గిరిజనుడు మృతి

By

Published : Jul 6, 2020, 7:18 AM IST

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం ఉప్పరి గోతుల గ్రామం వద్ద దూడ సుజనరాజు (65) అనే గిరిజనుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మండలంలో చావిడి కోట పంచాయతీ పొట్లవాడ గ్రామానికి చెందిన సుజనరాజు మృతదేహం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతేదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details