తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటకు చెందిన పిల్లి గోవిందరాజులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. ఆదివారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. బాదం ఆకుపై సూర్యనమస్కారాల ఆకృతులు తీర్చిదిద్దాడు. ఒక ఆకుపై 10 ఆసనాలు రూపొందించాడు. దీనికోసం గంట సమయం పట్టిందని చెప్పాడు.
యోగా డే ప్రత్యేకం: బాదం ఆకుపై సూర్య నమస్కారాలు - ఆకుపై సూర్యనమస్కారాల వార్తలు
ఎవరైనా సూర్య నమస్కారాలు ఎలా చేస్తారు... సూర్య భగవానుడికి ఎదురుగా నిల్చుని నేలపైన ఆసనాలు వేస్తూ నమస్కారాలు చేస్తారు. అలవాటు లేని వ్యక్తులు వాటిని వేయడం కాస్త కష్టమే. అయితే ఇలా చేయడం మాములే అనుకున్నాడేమా అతను కాస్త ప్రత్యేకంగా ఆలోచించాడు. ఆకుపై ఆసనాలు వేయించాడు. ఒకటి కాదు.. రెండు కాదు మొత్తం 10 ఆసనాలు ఒకే ఆకుపై వేయించాడు. ఆకేంటి.. దానిపై ఆసనాలు వేయడమేంటి అనుకుంటున్నారా... అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే..
బాదం ఆకుపై సూర్య నమస్కారాలు