తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బోటు వెలికితీసినందున... ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కచ్చులూరు తరహా బోటు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించాలంటూ... మాజీ ఎంపీ హర్షకుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ - గోదావరి బోటు ప్రమాదం వార్తలు
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
![బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4953140-906-4953140-1572846907861.jpg)
బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ