'చంద్రబాబు బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడం దారుణం' - mummidivaram ex mla meeting
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులకు ముమ్మిడివరం రైతులు అండగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు హామీ ఇచ్చారు. నియోజకవర్గ నాయకులతో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. జిల్లాలోని నాయకులను అరెస్టు చేసి, కేసులు పెట్టడం ద్వారా తెదేపాను బలహీన పరిచేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.