రాష్ట్రంలో వడగాలులు మొదలయ్యాయి. శుక్ర, శనివారాల్లో తూర్పుగోదావరి జిల్లాలో వీటి ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం 12 మండలాలు, శనివారం 24 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు, కూనవరం, నెల్లిపాక, వరరామచంద్రాపురం తదితర మండలాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదు కావచ్చు.
వడగాలులు మొదలయ్యాయ్... జర భద్రం - ఏపీలో ఎండల ప్రభావం తాజా వార్తలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా శుక్రవారం, శనివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
summer heat started in andhra pradesh
కృష్ణా జిల్లా చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లోనూ 39 డిగ్రీల పైనే ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని నాలుగైదు మండలాల్లో ఉక్కపోత వాతావరణం నెలకొంటుంది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
ఇదీ చదవండి: శ్రామిక్ పోస్టుకు మహిళ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలి: హైకోర్టు