ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులారా.. భూ సేకరణకు సహకరించండి' - nagampalli lands

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. భూసేకరణకు సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా సబ్​ కలెక్టర్ అనుపమ అంజలి రైతులను కోరారు. నాగంపల్లిలో పర్యటించిన అనుమప, భూములను పరిశీలించారు.

sub collector at nagampalli
నాగంపల్లిలో పర్యటించిన సబ్​ కలెక్టర్

By

Published : Sep 26, 2020, 7:22 PM IST

ప్రభుత్వ అవసరాలకు అవసరమైన చర్యల్లో భాగంగా చేపడుతున్న భూ సేకరణకు రైతులు సహకరించాలని.. తూర్పు గోదావరి జిల్లా సబ్​ కలెక్టర్ అనుపమ అంజలి సూచించారు. సీతానగరం మండలం నాగంపల్లిలో భూసేకరణకు సంబంధించిన భూములు కోసం సబ్​ కలెక్టర్ క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా.. చేపడుతున్న భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, రైతులు ముందుకు రావాలన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details