ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోడౌన్ నిర్మాణం కోసం స్థల పరిశీలన - Sub Collector anupama anjali latest News

రాజమహేంద్రవరంలోని రాజానగరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ స్థలాన్ని... సబ్ కలెక్టర్ అంజలి పరిశీలించారు. గోడౌన్ నిర్మాణానికి కావాల్సిన స్థలం గురించి అధికారులతో మాట్లాడారు. రాజానగరంలోని సర్వే నెంబర్ 179/2 లో గల స్థల వివరాలపై క్షేత్ర స్థాయిలో ఆరా తీశారు.

గోడౌన్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసిన సబ్ కలెక్టర్ అనుపమ
గోడౌన్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసిన సబ్ కలెక్టర్ అనుపమ

By

Published : Oct 15, 2020, 6:12 AM IST

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రాజానగరంలో సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పర్యటించారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అవసరాలకు గోడౌన్ నిర్మాణ స్థల పరిశీలన చేశారు. రాజానగరంలోని సర్వే నెంబర్ 179/2 లో గల స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

భూమి అవసరం ఉంది..

ఈ సందర్భంగా ఆ సర్వే నెంబర్​లో భూ వివరాలను మండల తహశీల్దార్ సబ్ కలెక్టర్ అనుపమ అంజలికి వివరించారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గోడౌన్ నిర్మాణానికి సంబంధించి భూమి అవసరం ఉందని సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పేర్కొన్నారు. పర్యటనలో మండల తహసీల్దార్ జి.బాల సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

మరో ఆవర్తనం: 3 రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన

ABOUT THE AUTHOR

...view details