ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'యాజమాన్య తప్పునకు విద్యార్ధులను బలి చేయొద్దు' - కాకినాడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష

యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్ధులను బలిచేయడం సరికాదని ఎస్​ఎఫ్​ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ పేర్కొంది. అందరికీ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరుతూ.. ఎస్ఎఫ్​ఐ ఆధ్వర్యంలో కాకినాడలోని జి్ల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.

ded students protest for conduct ded exams
యాజమాన్య తప్పుకు విద్యార్ధులను బలి చేయోద్దు

By

Published : Sep 26, 2020, 10:34 PM IST

కాలేజీ యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ జీవితాలు ప్రశ్నార్థంగా మారాయని కాకినాడలో డీఎడ్​ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎఫ్​ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సెప్టెంబరు 28 నుంచి జరుగుతున్న డీఎడ్‌ పరీక్షలు వాయిదా వేయాలని.. జీవో 30ని రద్దు చేసి భవిష్యత్తులో అందరికీ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ఎస్​ఎఫ్​ఐ నాయకులు డిమాండ్​ చేశారు.

యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్ధులను బలిచేయడం సరికాదని ఎస్​ఎఫ్​ఐ నాయకులు పేర్కొన్నారు. డీఎడ్​లో 2018-20 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్‌, స్పాట్‌ అడ్మిషన్‌ పొందిన విద్యార్ధులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చాలామంది జీవితాలు అందకారంలోకి వెళ్లాయన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details