తూర్పు గోదావరి జిల్లా యానం సమీపంలో... గౌతమి గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన రాజమండ్రికి చెందిన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యానాం పోలీస్, మత్స్యశాఖ, అగ్నిమాపకశాఖ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. గజ ఈతగాళ్లతో పాటు గేలంతో రాత్రి ఎనిమిది వరకూ వెతికినా విద్యార్థుల ఆచూకీ లభించలేదు. పుదుచ్చేరి మత్స్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు పర్యవేక్షించారు. గోదావరి ప్రవాహాన్ని గమనించి.. తెల్లవారుఝామున మళ్లీ గాలింపు చర్యలు చేపడతారని తెలిపారు.
పాపం.. ఆ విద్యార్థులు ఎక్కడున్నారో?! - students missing in godavari river
యానాం పోలీసులు, మత్స్య, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినా... గౌతమి గోదావరిలో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఇప్పటివరకూ దొరకలేదు.
విద్యార్థుల కోసం గాలింపు చర్యలు