ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాణ్యత లేని మధ్యాహ్న భోజనం.. ప్లేట్లతో విద్యార్థుల ఆందోళన

ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని పక్కనపెట్టి విద్యార్థుల ఆరోగ్యాలతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ ప్లేట్లతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి భోజనం కల్పించి తమ ఆరోగ్యానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

students are worried about poor quality food in east godavari district
నాణ్యత లేని మధ్యాహ్న భోజనం... ప్లేట్లతో విద్యార్థుల ఆందోళన

By

Published : Feb 25, 2021, 9:52 PM IST

నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు భోజనం కంచాలతో ఆందోళనకు దిగిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా ఇంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. కొన్ని రోజులుగా ఆహారం తిని కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. రోజూ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనం గట్టిగా ఉంటుందని.. గుడ్లు ఉడకడం లేదని, ఒక్కోసారి గుడ్ల నుంచి దుర్వాసన వస్తుందన్నారు.

అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, భోజన నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం ఎలా ఉన్నా తప్పకుండా తినాలని ఉపాధ్యాయులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. మధ్యాహ్నం భోజన విరామంలో ఇంటికి వెళ్లి తినేందుకు సైతం అనుమతి ఇవ్వడం లేదంటూ అవేదన వ్యక్తం చేశారు. మంచి భోజనం పెట్టి తమ ఆరోగ్యానికి భరోసా కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఈ విషయంపై ప్రధానోపాధ్యాయురాలు నాగేశ్వరిని వివరణ కోరగా.. రెండు రోజులుగా ఆహారం గట్టిగా ఉంటుందని తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఇదీ చదవండి

మలికిపురంలో ఎయిడెడ్ విద్యార్థుల నిరసన

ABOUT THE AUTHOR

...view details