తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే... ఆదరించి తాతయ్య పెంచాడు. ఇటీవల పెంచిన తాతయ్య చనిపోవటాన్ని ఆ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో నానమ్మ, తాతయ్య ఫోటోను చేతిలో పట్టుకొని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెంచిన తాతయ్య లేడని... ప్రాణం తీసుకున్నాడు - student suicide in thatipaka news
చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమయ్యారు...అల్లారు ముద్దుగా పెంచిన తాతయ్య మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఓ యువకుడు తనను పెంచిపెద్ద వాడిని చేసిన నానమ్మ, తాతయ్యల ఫోటో చేతిలో పట్టుకుని వారిని చూస్తూనే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం తాటిపాకలో జరిగింది.

తాతయ్య కోసం మనవడి బలవన్మరణ
కోటనందూరు మండలం తాటిపాక గ్రామానికి చెందిన 22 ఏళ్ల అల్లు నాగేశ్వరరావు బీఫార్మసి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాత, నానమ్మల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. నాలుగునెలల క్రితం తాతయ్య అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటినుంచి మనస్తాపానికి గురైన నాగేశ్వరరావు... నానమ్మ, తాతయ్య ల ఫోటో చేతిలో పట్టుకుని వారిని చూస్తూనే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ చదవండి:ఆంక్షలు విధించినా.... పట్టించుకోని అమలాపురం ప్రజలు