ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రేమ పేరుతో మోసగించాడు.. అతనిపై చర్యలు తీసుకోండి'

ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడని ఓ యువతి తన స్నేహితులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నిరసన చేపట్టింది. వైకాపా ముఖ్యనేతలు అతనికి అండగా ఉండటం వల్లే.. తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపించింది.

student protest for cheated in the name of love at amalapuram
ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడని విద్యార్థుల ధర్నా

By

Published : Mar 10, 2021, 7:47 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో విద్యార్థులు ధర్నా చేశారు. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడని అతని ఇంటి వద్ద ధర్నా చేసింది ఓయువతి. స్నేహితులు సైతం ఆమెకు అండగా నిలబడి.. నిరసన తెలిపారు.

తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెల్లుబోయిన ధనుష్ కృష్ణ మోసం చేశాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని యువతి డిమాండ్ చేసింది. ధనుష్ కు వైకాపా ముఖ్యనాయకులు అండగా ఉంటున్నారని, అందుకే తనకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:

మహిళలపై దౌర్జన్యం హేయమైన చర్య: దేవినేని ఉమా

ABOUT THE AUTHOR

...view details