Student letter to teachers: తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి మద్యం తాగి పాఠశాలకు వచ్చిన వైనాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. ఆ విద్యార్థి తండ్రిని పిలిపించి, మీ అబ్బాయి ప్రవర్తన బాగా లేదని చెప్పారు. ఇంటి వద్ద మేం చెబుతున్నా వినడం లేదు.. మీరైనా చెప్పండంటూ ఆయన వెళ్లిపోయాడు. దీనిపై ఆ విద్యార్థి రాసిన లేఖను చూసి ఉపాధ్యాయులు విస్మయం చెందారు.
‘నేను రోజూ క్వార్టర్ మద్యం తాగుతా.. పాఠశాలకు సమీపంలోని ఒక దుకాణంలో సిగరెట్లు కొనుక్కుని కాల్చుతున్నా. పి.గన్నవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుక్కుంటున్నా. ఆ డబ్బుల కోసం ఇటుక బట్టీలో పనికి వెళ్తున్నా.. ఇక మీదట ఇలా చేయను..’ -లేఖలో విద్యార్థి