తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూరైంది. జిల్లాలోని ఏడు రెవెన్యూ డివిజన్ల పరిధి లోని 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే కీలక అధికారులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరిచారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు మిగిలిన ఓట్ల లెక్కింపు చేపట్టారు. జిల్లాలో 62 జడ్పీటీసీ స్థానాలకు గాను 61 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1086 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 82 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 999 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ స్థానాల్లో 2,620 మంది అభ్యర్థులు, జడ్పీటీసీ స్థానాల్లో 234 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫలితాల్లో అధికార వైకాపా విజయభేరి మోగించింది. వైకాపా 764, తెదేపా 110, జనసేనకు 93 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. స్వతంత్రులు 19, సీపీఎం 7 బీఎస్పీ 1, భాజపా 2, ఐఎన్‌సీ 1 చోట గెలుపొందాయి. జిల్లాలో 61 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగ్గా.. వైకాపా 57, తెదేపా 1 , జనసేన 1జడ్పీటీసీ స్థానంలో విజయం సాధించాయి.
ఇదీ చదవండి : వేడెక్కిన కాకినాడ నగరపాలక రాజకీయం.. పీఠం కోసం వైకాపా అడుగు
బ్యాలెట్ బాక్సుల్లోకి వర్షపు నీరు..
కరప మండలం అరట్లకట్టలో బ్యాలెట్ బాక్సుల్లోకి వర్షపు నీరు చేరుకుంది. పెద్దాపురం మండలం పులిమేరులో 60 బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టాయి. చెదపట్టిన ఓట్లను సిబ్బంది పక్కనబెట్టి, ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు.