తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ కర్ఫ్యూ విధించటంతో కోనసీమలోని ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.
కాకినాడ నగరంలో బానుగుడి, కల్పన, కోకిల, డిమార్ట్, సర్పవరం, బాలాజీ చెరువు, సంతచేరువు, జగన్నాధపురం తదితర ప్రాంతాల్లో... రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఏవరైనా రహదారులపై తిరుగుతుంటే పోలీస్ సిబ్బంది హెచ్చరించి పంపిస్తున్నారు.
కాకినాడ నగరం, గ్రామీణం బోసిపోయింది. జనసంచారం లేక రోడ్లన్నీ, దుకాణాలు వెలవెలబోయాయి. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ అధికారులు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.