ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకలి ముందు.. తెలియని కాళ్ల మంటలు - ఆకలితో వాహనాల వెంట పరుగులు తీస్తున్న బాలల

మండే ఎండ సైతం చిన్నారులకు కనిపించడం లేదు. తారురోడ్డు పొగలు కక్కుతున్నా పిల్లల పరుగులు ఆగడం లేదు. ఇదంతా జానెడు పొట్టను నింపుకునేందుకు వాళ్లు పడుతున్న అవస్థలు. దాతల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్న చిన్నారులు వాహనాల వెంట పరుగులు తీస్తున్నారు.

street children run for food in amalapuram
ఆకలితో వాహనాల వెంట పరుగులు తీస్తున్న బాలల

By

Published : Apr 25, 2020, 12:36 PM IST

ఆకలితో వాహనాల వెంట పరుగులు తీస్తున్న బాలలు

మండుటెండలో కాళ్లు కాలుతున్నా లెక్క చేయకుండా పరుగులు పెడుతున్నారా చిన్నారులు... ఆకలి మంట ముందు కాళ్ల మంట ఏ మాత్రం ఎక్కువ కాదనుకుంటూ ఆహారం అందించే వాహనాల ఎక్కడ ఆగుతాయో తెలియక వాటి వెనుక పరుగులు తీస్తున్నారు.

దయనీయంగా ఉన్న ఈ దృశ్యాలు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోవి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల్లో పుట్టిన పిల్లలు వారు. రోజు కూలీపై బతికే వారికి లాక్​డౌన్ వలన పనుల్లేక పస్తులుంటున్నారు. ఆకలికి తట్టుకోలేక ఆ చిన్నారులు ఇలా రోడ్లపైకి వచ్చి నిరీక్షిస్తున్నారు. దాతలు ఇచ్చే ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నామనీ దీనంగా చెప్తున్నారీ చిన్నారులు.

ఇదీ చదవండి:ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయలు పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details