తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం డి.రావులపాలెం గ్రామాంలో నాలుగు ఎకరాల చేపల చెరువులో దుండగులు విషం కలిపారు. తన చేపల చెరువుల్లో సాగు చేస్తున్న రొయ్యలు, ఇతర రకాల చేపలను గుర్తు తెలియని వ్యక్తులు క్రిమిసంహారక మందు కలిపి చంపేశారని రైతు బొబ్బిలి శ్రీనివాస్ ఆరోపించారు. సమారు 15 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని విచారం వ్యక్తం చేశాడు.
రైతు బొబ్బిలి శ్రీనివాస్ డి.రావులపాలెం గ్రామంలో బి.సావరం వద్ద నాలుగు ఎకరాల చెరువులు లీజుకు తీసుకున్నారు. అందులో రొయ్యలు, చేపలు సాగు చేస్తునట్లు చెప్పారు. వారం క్రితం రాత్రి పూట వాటికి మేత వేసి ఇంటికి వెళ్లిపోయానని, మరుసటి రోజు ఉదయం చెరువు వద్దకు వచ్చేసరికి గట్టుపై రొయ్యలు పడి ఉన్నాయన్నారు. ఎవరో రొయ్యలు దొంగతనం చేసి ఉంటారని అనుమానించానని చెప్పారు.