ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టి తరలింపు పనులు నిలిపివేత - మట్టి తరలింపు పనులు నిలిపివేత

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామ పరిధిలోని పెరుగులంక భూముల మట్టి తరలింపు పనులపై గ్రామ ఎస్సీ సొసైటీ సభ్యులు స్థానిక తహసీల్దార్​ను ఆశ్రయించారు. మట్టి తరలింపు పనులు చేపట్టవద్దంటూ హైకోర్టు స్టే విధించినా...తవ్వకాలు జరుపుతున్నారని ఆవేదన వక్తం చేశారు. దీంతో తహసీల్దార్ మట్టి తరలింపు పనులను నిలుపుదల చేయించారు.

మట్టి తరలింపు పనులు నిలిపివేత
మట్టి తరలింపు పనులు నిలిపివేత

By

Published : Jun 4, 2020, 9:14 AM IST

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామ పరిధిలోని పెరుగులంక భూముల నుంచి మట్టిని తరలించవద్దంటూ హైకోర్టు స్టే విధించింది. గ్రామంలోని పేదలకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసేందుకు కొంత భూమిని కేటాయించింది. స్థలాలు మెరక చేసేందుకు అవసరమైన మట్టిని తవ్వి తరలించేందుకు గ్రామంలోని పెరుగులంక భూమిని అధికారులు గుర్తించారు. మే 15న మట్టి తవ్వకాలు ప్రారంభించారు.

గ్రామ ఎస్సీ సొసైటీకి చెందిన కొంత మంది రైతులు పెరుగులంక భూమిలోని మట్టిని తొలగించడం వల్ల సాగు భూమి కోతకు గురయ్యే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మట్టిని తరలిస్తే భూమి కోతకు గురై నదీ గర్భంలో కలిసే ప్రమాదముందని హైకోర్టును ఆశ్రయించారు. మట్టి తరలింపును నిలుపుదల చేయాలని హైకోర్టు స్టే విధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినా... మట్టి తరలింపు పనులు కొనసాగించడంతో తహసీల్దారును సొసైటీ సభ్యులు ఆశ్రయించారు. దీంతో మట్టి తరలింపు పనులను తహసీల్దారు నిలుపుదల చేసారు.

ABOUT THE AUTHOR

...view details