చిన్నారి దీప్తిశ్రీని సవతితల్లి శాంతికుమారే హత్య చేసిందని తూర్పు గోదావరి ఎస్పీ నయీమ్ అస్మీ అన్నారు. చేసిన నేరాన్ని సవతితల్లి మొదట ఒప్పుకోలేదని... గట్టిగా అడిగేసరికి మొత్తం వివరాలు చెప్పిందని ఎస్పీ తెలిపారు. ఈ హత్య కేసులో ఇతరుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దీప్తిశ్రీ కోసం 5 బృందాలుగా ఏర్పడి గాలించినట్లు తెలిపారు. నిందితురాలిపై అపహరణ, హత్య కేసులు పెట్టామన్నారు. కేసు విచారణలో సీసీ కెమెరా దృశ్యాలు చాలా సాయపడ్డాయని వివరించారు.
దీప్తిశ్రీని చంపింది సవతి తల్లే: ఎస్పీ - step mothe murdered babyh at kakinada
దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారే హత్య చేసిందని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ వెల్లడించారు. నిందితురాలిపై అపహరణ, హత్య కేసులు పెట్టినట్లు తెలిపారు. చిన్నారి హత్య కేసులో ఇతరుల ప్రమేయం లేదన్నారు.
![దీప్తిశ్రీని చంపింది సవతి తల్లే: ఎస్పీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5172388-849-5172388-1574683386756.jpg)
దీప్తిశ్రీ హత్యపై ఎస్పీ
దీప్తిశ్రీ హత్య వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అస్మీ
ఇదీ చదవండి