వినాయకచవితిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన కళాకారుడు దేవిన శ్రీనివాస్ సబ్బుతో వినాయకుడి ప్రతిమను రూపొందించారు. సుమారు నాలుగు గంటలు శ్రమించి సబ్బుపై విగ్నేశ్వరుని రూపాన్ని తీర్చిదిద్దారు. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ఇసుకతో సైకత శిల్పాలు రూపొందించే శ్రీనివాస్ వినాయక చవితి సందర్భంగా సబ్బుపైనే బొజ్జ గణపయ్యను తీర్చిదిద్ది వినూత్నరీతిలో తన భక్తిని చాటుకున్నాడు.
భక్తిని చాటుకున్న కళాకారుడు.. సబ్బుతో గణేశుడి ప్రతిమ - రంగంపేటలో సబ్బుతో వినాయకుడు
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కళాకారుడు వినాయకుడి పట్ల తనకున్న భక్తిని చాటుకున్నాడు. సబ్బుతో విఘ్నేశ్వరుడి ప్రతిమను రూపొందించాడు.
Statue of Ganesha with soap in rangampeta east godavari district