ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్తిపాడులో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు - east godavari district latest news

తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు జరిగాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో.. గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు.

state wide bullock cart competitions in prathipadu east godavari district
ధర్మవరంలో ఘనంగా రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు

By

Published : Mar 28, 2021, 9:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పోటీదారులు హాజరయ్యారు. పోలవరం కాలువ గట్టున పందాలు నిర్వహించడం ప్రమాదకరమన్న పోలీసులు.. కమిటీ, గ్రామస్థులతో చర్చించి పోటీలు నిర్వహించారు.

సీనియర్, జూనియర్ విభాగాలలో ఈ పోటీలు జరిగాయి. సీనియర్ విభాగంలో 5 బండ్లు, జూనియర్ విభాగంలో 51 ఎడ్ల బండ్లు పందాల్లో పాల్గొన్నాయి. సీనియర్, జూనియర్ విభాగాల్లో కోరా శృతి చౌదరికి చెందిన ఎడ్లు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు.

ఇదీచదవండి.

ఘనంగా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం

ABOUT THE AUTHOR

...view details