విజయవాడలో...
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలకు 120 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ఫిల్టర్లను దేవినేని నెహ్రూ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, వైకాపా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అందించారు. విద్యార్థుల కోసం సీఎం జగన్... నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఈ కార్యక్రమంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా...
ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించి, జల సంరక్షణలో భాగస్వాములు కావాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. అనంతరం స్థానిక చెరువుకు పూజలు చేసి, జల సంరక్షణకై ప్రజల కోసం ప్రతిజ్ఞ చేయించారు. కిర్లంపూడి మండలం జగపతినగరంలో మండలస్థాయి అధికారులతో, గ్రామ వాలంటీర్లతో జల సంరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నీటిని వృథా చేయకుండా రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్లో పెట్రోల్, డీజిల్ ధరల కంటే ఎక్కువ ధరకు నీటిని కొనుక్కోవలసిన దుస్థితి వస్తుందని అన్నారు.