తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఎంపీడీవో రాజేంద్రప్రసాద్... ఎంఈవో హరిప్రసాద్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఉపాధ్యాయులు అందించారు. నాడు- నేడు పనుల అమలులో క్షేత్ర స్థాయి సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా అధికార యంత్రాంగం ఒత్తిడిని పెంచుతోందని ఆవేదన చెందారు.
ప్రధానోపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని నిరసన తెలిపారు. వారిని పర్యవేక్షణకు మాత్రమే వినియోగించాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకోవాలని కోరారు. నాడు- నేడు పనుల అమలులో క్షేత్ర స్థాయి సమస్యలను పరిగణలోకి తీసుకుని... విద్యాశాఖ అధికారులు సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.