ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమ పదోన్నతులకు రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అడ్డుపడుతోందని ఆరోపించారు.
'వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలి' - State Revenue Officers Association protest at east godavari district news
వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని రాష్ర్ట రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
రాష్ర్ట రెవెన్యూ అధికారుల సంఘం
క్షేత్ర స్థాయిలో సందర్శనలు చెయ్యాల్సి ఉన్నందున బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీపీఎస్ రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. గ్రేడ్ 2 వీఆర్వోలకు పే స్కేల్ ఇవ్వాలని గ్రామ రెవిన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి డీవీ రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి: