తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీల్లో బాలుర విభాగంలో తూర్పుగోదావరి, కృష్ణ, శ్రీకాకుళం, విశాఖ జట్లు.. బాలికల విభాగంలో కృష్ణ, గుంటూరు, విజయనగరం జిల్లాల నుంచి సెమీ ఫైనల్కు చేరుకున్నాయి.
కిర్లంపూడిలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు - State level kabaddi competitions at Kirlampudi news
రాష్ట్రస్థాయి జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిర్వహించారు. ఈ పోటీలను మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తిలకించి మాట్లాడారు.
కిర్లంపూడిలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ పోటీలను తిలకించి మాట్లాడారు. తాను రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో కిర్లంపూడిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రు తదితరులు పాల్గొన్నారు.