తూర్పుగోదావరి జిల్లా కొండవరం జిల్లా పరిషత్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీలు ఘనంగా ప్రారంభమ్యయాయి. ఈ పోటీలను కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ..చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడల్లో బాలికలు కూడా ఉత్సాహాన్ని చూపడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల ఆవరణలో మెుక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ..మెుక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 250 మంది విద్యార్థులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీలు ప్రారంభం - vanga geeta
రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీలను తూర్పుగోదావరి జిల్లా కొండవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభించారు. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత ముఖ్యఅతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె సూచించారు.
కర్రసాము పోటీలు ప్రారంభం