తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని యల్లమిల్లి గ్రామంలో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్లపందేలు జరిగాయి. సీనియర్ విభాగంలో 5 జతల ఎడ్లు, జూనియర్ విభాగంలో 28 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పందేల్లో సీనియర్ విభాగంలో ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన కోర శృతిచౌదరి మొదటి బహుమతి, రూ.10వేల నగదు గెలుచుకోగా, రెండో బహుమతి పెద్దాపురం మండలం ఆర్‌బి కొత్తూరు గ్రామానికి చెందిన చుండ్రు సత్యనారాయణ రూ.8వేల నగదు, తృతీయ బహుమతి గుంటూరు జిల్లా కంకన్నపాలెంకు చెందిన కాక హేమంత్ కుమార్ రూ. 6వేల నగదు గెలుపొందారు. జూనియర్ విభాగంలో గండేపల్లి మండలం యల్లమిల్లికి చెందిన సుంకవిల్లి రిథిక్ శ్రీకర్‌చౌదరి ప్రథమ బహుమతి , చెముడులంక గ్రామానికి చెందిన నాగిరెడ్డి రెండో బహుమతి , ఆర్‌బీ కొత్తూరు మన్యం సత్యనారాయణ తృతీయ బహుమతి గెలుపొందారు.
జోడెడ్ల బండి.. పోటాపోటీ - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
యల్లమిల్లి గ్రామంలో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్లపందేలు నిర్వహించారు. సీనియర్ విభాగంలో 5 జతల ఎడ్లు, జూనియర్ విభాగంలో 28 జతల ఎడ్లు పాల్గొన్నాయి. గుమ్మిలేరుకు చెందిన కోర శృతిచౌదరి మొదటి బహుమతి గెలుచుకున్నారు.
![జోడెడ్ల బండి.. పోటాపోటీ state-level-bull-race](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10819775-740-10819775-1614572663946.jpg)
state-level-bull-race