గత పంచాయతీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏడు శాతం లోపలే ఏకగ్రీవాలు అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. జిల్లాలో ఈసారి నామినేషన్లు బాగా పెరిగాయని అన్నారు. ఏకగ్రీవాలకు ఎస్‌ఈసీ వ్యతిరేకం కాదని మరోసారి ఉద్ఘాటించారు. బాధ్యతగా భావించి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించానని ఎస్‌ఈసీ అన్నారు.
శ్రీనివాసరెడ్డి మృతి కేసును ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
'ఏకగ్రీవాలకు ఎస్‌ఈసీ వ్యతిరేకం కాదు' - తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు
ఏకగ్రీవాలకు ఎస్‌ఈసీ వ్యతిరేకం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.

state election commission nimmaadda ramesh kumar east godavari tour
తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పర్యటన