ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్వేది లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న వ్యవసాయ మిషన్ వైస్​ ఛైర్మన్ - అంతర్వేదిలో పర్యటించిన వ్యవసాయ మిషన్ వైస్​ఛైర్మన్

రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి.. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు.

agriculture mission vice chairman visited antarvedi temple
అంతర్వేది ఆలయాన్ని సందర్శించిన వ్యవసాయ మిషన్ వైస్​ఛైర్మన్

By

Published : Mar 21, 2021, 9:15 PM IST

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో.. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి.నాగిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయ స్వాగతం పలికారు. దైవ దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని ఆలయ సూపరింటెండెంట్ అందజేశారు.

వెంట వచ్చిన వైకాపా నేతలతో నాగిరెడ్డి మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. అంతర్వేదిలోని 14 ఎకరాల చెరువును ఆర్​డబ్ల్యూఎస్ పరిధిలోకి తీసుకుని.. ఆధునీకరణ చేయాలని స్థానికులు కోరారు. సాగు, తాగునీటికి సఖినేటిపల్లి మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details