వచ్చే ఏడాదిలో జనవరి 20 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉన్నత అధికారుల నుంచి వచ్చిన సంకేతాలతో దిగువ స్థాయి సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రామ పంచాయతీ మండల పరిషత్ పాలకవర్గాలు రద్దై ఏడాది కావస్తుంది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో 68 గ్రామ పంచాయతీలు, 781 వార్డులు, 69 ఎంపీటీసీ స్థానాలు, 4 ఎంపీపీ అధ్యక్ష పదవులు, 4 జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గంలో 217 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. వీటితోపాటు పంచాయతీ ఎన్నికలకు 781 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఈ నియోజకవర్గంలో 2లక్షల 13 వేల మంది ఓటర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్నారు. దీనికి అవసరమైన బ్యాలెట్ బాక్సులనుమండల పరిషత్ కార్యాలయ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. ఓటర్ల వివరాలను ఉన్నతాధికారులకు ఆన్లైన్లో పంపుతున్నారు.
సంక్రాంతి తర్వాత ఓట్ల పండుగ... సిద్దమవ్వాలి ముందుగా... - ఆంధ్రాలో ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలకు దిగువ స్థాయి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో ఓటర్ల వివరాలు అప్డేట్ చేయడం సహా, బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేస్తున్నారు.
![సంక్రాంతి తర్వాత ఓట్ల పండుగ... సిద్దమవ్వాలి ముందుగా... staff arrangements for local bodies elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5467297-345-5467297-1577098036767.jpg)
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారుల
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారుల