జగన్‌పై హత్యాయత్నం కేసు నిందితుడికి అస్వస్థత
వైకాపా అధ్యక్షుడు జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు జ్వరం రావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చికిత్స అందించారు. అయినా తగ్గకపోవడంతో సోమవారం రాత్రి అత్యవసరంగా ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డుకు తరలించారు. శ్రీనివాసరావు మలేరియా వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఫిబ్రవరిలో రిమాండ్‌పై రాజమహేంద్రవరం కేంద్రకారాగారానికి తరలించారు. ప్రభుత్వాసుపత్రి వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.