తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం నయనానందకరంగా సాగింది. రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. గోవింద నామ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ఏటా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ రథయాత్రలో కరోనా కారణంగా భక్తులపై పోలీసులు ఆంక్షలు విధించారు. రథోత్సవం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం - yanam latest news
తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా... స్వామి, అమ్మవార్లు రథంపై ఊరేగారు. ఈ రధయాత్రతో ఉత్సవాలు ముగింపుకు చేరుకున్నాయి.
యానాంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం వారి